జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ ను సొంత పార్టీ కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాపాక వరప్రసాద్ రాజీనామా చేశారంటూ వదంతులను పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందుగా రాపాక వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. అసెంబ్లీ సమావేశాల కారణంగా పవన్ సభకు హాజరు కాలేదని గతంలో చెప్పిన రాపాక.. తాజాగా మాట్లాడుతూ.. ఇతర కారణాలతో పవన్ సభకు వెళ్లలేదని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేసినా పదిమంది మాత్రమే వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న విషయానికి ధర్నాలు, సభలు పెట్టడం సరికాదని రాపాక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ముందుముందు పవన్ సభలకు ఇంకా ఆదరణ తగ్గిపోతుందని సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించడంతో పవన్ కళ్యాణ్‌కు షాక్ తగిలినట్టు అయింది.