పిడుగు పడి ఏళ్ళ వయసు ఉన్న ఒక పనసు చెట్టు సగ భాగం కాలిపోయింది. ఇక అక్కడ ఉన్న వారు అందరూ ఆ చెట్టుని నరికేద్దాం అని చూసారు… కాని… ఒక వ్యక్తి మాత్రం అందుకు ఎంత మాత్రం ఇష్టపడలేదు. నాకు ఆరు నెలల సమయం ఇవ్వండి పనసకాయలు కాయిస్తా అని మాట ఇచ్చాడు. అతని మాటను గౌరవించి అందరూ అతన్ని నమ్మారు… వెంటనే రంగంలోకి దిగిన అతను… ఎండు గడ్డి పొడి, చెదలు పుట్ట బురద, ఆవు పాలు, పొలంలో మట్టి, తేనె, ఆవు పేడ మిశ్రమాన్ని కలిపి ఒక ముద్దలా తయారు చేసాడు ఆయన…
వెంటనే ఆ చెట్టులో కాలిన భాగాన్ని పూర్తిగా శుభ్రం చేసి… ఆ మిశ్రమాన్ని ఆ దెబ్బ తగిలిన ప్రాంతంలో పూసారు… ఒక కాటన్ వస్త్రం తీసుకుని దాన్ని కప్పి ఉంచి ఆ కాటన్ వస్త్రాన్ని రోజు తడపమని అక్కడి వారికి చెప్పాడు… సీజన్ రాగానే ఆ చెట్టు కాయలు కాసింది. అక్కడ ఉన్న వారు చూసి ఆశ్చర్యపోయారు. ఆయన పేరు కే. బిను… చెట్ల డాక్టర్… దాదాపు ఇలా 23 చెట్లను ఆయన బ్రతికించారు. కేరళ సాంప్రదాయంలోనే ఉండే ఆయన… ఎక్కడైనా సరే చెట్టు దెబ్బ తింటే దానిని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చే వరకు ఆయనకు నిద్రపట్టదు.
దీనిపై ఆయననను ప్రశ్నించగా ఎప్పటి నుంచో ఈ వైద్యం ఉందని మనుషులకు కాళీ లేక చెట్లను వదిలేసారని ఆయన చెప్పాడు. మనిషికి గాయం అయితే చంపనప్పుడు చెట్టుకి గాయం అయితే ఎందుకు చంపాలి అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు ఈ చెట్టు ప్రేమికుడు. దీనితో ఇప్పుడు కేరళలో ఏ చెట్టుకి గాయం అయినా సరే ఈయన్నే సంప్రదిస్తారు అక్కడి అధికారులు కూడా… వెంటనే ఆయన అక్కడ వాలిపోతారు. చెట్లకు వచ్చే వ్యాధులను కూడా ఆయన, ఆవు పెడ, గేదె పెడ, అరటి పండు గుజ్జు ఇలాంటి వాటితో నయం చేస్తూ ఉంటారు…