ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందు అడుకుంటున్న బాలికను కత్తితో బెదిరించి ఇంట్లోకి పిలిచి అత్యాచారయత్నం చేశాడు ఆ బాలిక పక్కింటి వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా ధారూరు మండలం మోమిన్ కలాన్ లో రాములు అనే 40 సంవత్సరాల వ్యక్తి ఇంటి ముందు అడుకుంటున్న బాలికను అన్నం పెట్టి ఇవ్వమని ఇంట్లోకి పిలిచాడు. అయితే ఇంట్లోకి వచ్చి అన్నం పెడుతున్న ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
అయితే రాములు పశుబలాన్ని తట్టుకుని అతడిని కిందకి పడదోసి నుండి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి తల్లికి చెప్పింది. దీంతో ఆమె డయల్ 100కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలికను సఖీ కేంద్రానికి తరలించి, వివరాలు సేకరించిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాములును పోలీసు అదుపులోకి తీసుకున్నారు. బాడిత బాలిక తల్లి ఫిర్యాదుతో అతని మీద రేప్ అండ్ పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.