దారుణం : నాలుగేళ్ల చిన్నారి పై 15 ఏళ్ళ కుర్రాడు రేప్ !

-

మన దేశంలో రాను రాను ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోతోంది. మూడేళ్ళ పాప నుండి ముదుసలి దాకా ఈ లైంగిక దాడులకు గురవుతున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తాజాగా నిజామాబాద్ జిల్లా జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ళ చిన్నారి పై 15 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

child rape cases

ఏరుగట్ల మండలంలోని ఓ తండాలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయం చూసి చిన్నారి పై బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు చెబుతున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక బాలుడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన తండా వాసులు అతనిని పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version