ఇండియాలో కొత్తగా 9,283 కరోనా కేసులు.. 535 రోజుల తర్వాత ఇదే మొదటి సారి

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓరోజు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 8 వేలు నమోదు అయిన కరోనా కేసులు… ఇవాళ మళ్ళీ భారీగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా… 9283 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి.

ఇక అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 10,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఇండియా వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య…3,39,57, 698 కు చేరుకుంది. ఇక ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య.. 1,11,481 గా నమోదు అయింది. ఇంత తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం.. ఐదు వందల ముప్పై ఐదు రోజుల తర్వాత ఇదే మొదటి సారి కావడం విశేషం. గా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 118 కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ఇప్పటివరకూ 63 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లు వేసింది సర్కార్. ఇక ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.33 శాతంగా ఉంది.