మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. పసిపిల్లలు, ముసలి వాళ్ళు ఆఖరికి మగవాళ్ళను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాకిస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. 11ఏళ్ల మైనర్ బాలుడిపై అత్యాచారం జరిగింది. అంతే కాకుండా ఆ తర్వాత బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. బాలుడి మృతదేహం ప్రావిన్స్ లో ఖైర్ పూర్ మీర్ ప్రాంతంలోని బబార్లోయ్ పట్టణంలో ఓ పాడుబడిన ఇంట్లో గుర్తించారు. అంతే కాకుండా బాధితుడు హిందూ బాలుడిగా తెలుస్తోంది.
గురునానక్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు వేడుకల్లో బిజీ ఉన్న సమయం లో బాలుడు మయమైనట్టు చెబుతున్నారు. ఆ తరవాత గాలింపులు చేపట్టగా శవంగా కనిపించాడు. ఇక బాలుడి శరీరంపై గాయాలను గుర్తించిన పోలీసులు ముందుగా బాలుడి గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చి ఆ తరవాత అత్యాచారం చేశారని భావిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు నేరాన్ని అంగీకరించారు.