ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ర్యాపిడో ఫ్రీ రైడ్

-

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఓటింగ్ హక్కుల వినియోగంపై సమాచారాన్ని ప్రచారం చేయడం చేస్తున్నాయి. ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో భాగంగా రైడ్-షేరింగ్ యాప్ ‘రాపిడో’ రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది.

ఎన్నికల రోజున, ఓటర్లు రాపిడో యాప్‌ లో “VOTE NOW” అనే కోడ్‌ ను ఉపయోగించి ఉచిత రైడ్‌ ను పొందవచ్చని ,ఓటు శాతాన్ని పెంచుకునేందుకు అన్ని విధాలా పని చేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. వికలాంగులు, వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే మార్గంలో రవాణా సదుపాయం లేకుండా తమ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news