T20 World Cup:హెలికాప్టర్ తో ఇండియా వరల్డ్ కప్ జెర్సీ రివీల్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే T20 ప్రపంచకప్‌ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే… పొట్టి ప్రపంచ కప్ కోసం టీన్ఇండియా జెర్సీని రివీల్ చేశారు. ధర్మశాలలో జరిగిన జెర్సీ లాంచ్ కార్యక్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజా, కుల్దీప్ యాదవ్ పాల్గొన్నారు. అందరి దృష్టిని ఆకర్షించేలా వినూత్నంగా హెలికాప్టర్ సాయంతో జెర్సీని విడుదల చేశారు. బ్లూ, ఆరెంజ్ రంగులో ఉన్న ఈ జెర్సీ రేపటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉండనుంది. జూన్ 2 నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుండగా 9వ తేదీన పాక్తో భారత్ తలపడనుంది.

వరల్డ్ కప్పుకు ఎంపిక కాబడిన ప్లేయర్ల లిస్ట్ :

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జైస్వాల్, గిల్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, రింకూ సింగ్, కేఎల్ రాహుల్, శాంసన్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, బిష్ణోయ్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్ దీప్, అవేశ్ ఖాన్.

Read more RELATED
Recommended to you

Latest news