నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది..ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది కరోనా పేషెంట్..నిజామాబాద్ నగరానికి చెందిన గర్భణి..డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది..గర్భిణికి కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. రిజల్ట్‌లో ఆమెకు పాజిటివ్ వచ్చింది..దీంతో వైద్యులు ఆమెను ప్రత్యేక కరోనా వార్డులో చికిత్స అందించారు డాక్టర్లు..ఆమెకు నొప్పులు రావడంతో ప్రసూతి వార్డుకు తరలించారు.
డెలివరీ సమయంలో ఆ మహిళకు ఐసోలేషన్ చికిత్స అందించి..ఆపరేషన్ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్లకు కరోనా టెస్ట్ చెయ్యగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్..ఇప్పుడు తల్లి, పిల్లలు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారన్నారు..తల్లి,ముగ్గురు పిల్లలను డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు..కరోనా పాజిటివ్ ఉన్న మహిళకు ముగ్గురు పిల్లలు జన్మిచడం రాష్ట్రంలోనే మొదటి కేస్ గా భావిస్తున్నమని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సుపరెండేంట్ ప్రతిమ రాజ్ తెలిపారు.