నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న రష్మిక…!

-

టాలీవుడ్ లో ఇప్పుడు రష్మిక మంధనా హవా ఎక్కువగా నడుస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూ ఈ అమ్మడు దూసుకుపోతుంది. వరుస అవకాశాలతో స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తుంది ఈ భామ. అగ్ర దర్శకులు కూడా ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందుకి వస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా రెండు హిట్స్ కొట్టి మంచి ఊపు మీద ఉంది రష్మిక మంధన. ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టింది.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న ఆశ్చర్య సినిమాలో ఈమె రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా మిగిలిన షూటింగ్ ని చిత్ర యూనిట్ వాయిదా వేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రామ్ చరణ్ పాల్గొనే షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మరో సినిమా ఎన్టీఆర్ తో చేయడానికి సిద్దమవుతుంది.

ఇదిలా ఉంటే ఈ భామ ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. స్టార్ హీరోలతో మినహా సినిమా చేయను అని చెప్తుంది ఈ భామ. అలాగే పారితోషికం కూడా భారీగా పెంచేసింది. అగ్ర హీరోలతో అయితేనే సినిమాలు చేస్తాను అని చెప్తుంది రష్మిక. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో రెండు కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఆ ధరను మరింతగా పెంచే ఆలోచనలో ఉందని అంటున్నారు. దీనితో ఆమెతో సినిమా చెయ్యాలి అనుకునే నిర్మాతలు భయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version