నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రష్మిక మందన కు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ సాధించాయి.
ఇలా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన తాజాగా తన వృత్తగత జీవితంతో పాటు ప్రేమ, రిలేషన్‌షిప్, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చింది… ప్రేమంటే నా దృష్టిలో మాటల్లో వర్ణించలేనిది. కేవలం అది ఫీలింగ్స్ కు సంబంధించిన విషయం మాత్రమే. ప్రేమ అనేది రెండు వైపుల నుండి ఉంటేనే ఆ బంధం ముందుకు కొనసాగుతోంది. అని లవ్ మరియు రిలేషన్ గురించి ప్రత్యేక రష్మిక మందన చెప్పుకొచ్చింది.
ఇక పెళ్లి గురించి రష్మిక మందన స్పందిస్తూ… నా వయసు ప్రస్తుతానికి చిన్నది. అందువలన పెళ్లి గురించి ఏ విధంగా ఆలోచించాలో నాకు తెలియడం లేదు. పెళ్లికి సంబంధించిన ఆలోచనలను నా మనసు లోకి కూడా నా రానివ్వడం లేదు. నన్ను ఎవరైతే ప్రేమగా, సురక్షితంగా చూసుకుంటారో వారిని పెళ్లి చేసుకుంటాను అని రష్మిక మందన చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫిబ్రవరి 25 వ తేదిన విడుదల కాబోతుంది.