రష్మిక రెమ్యునరేషన్ డబుల్ అయిందా

Join Our Community
follow manalokam on social media

కరోనా టైంలో రెమ్యునరేషన్‌ కొందరు తగ్గించుకుంటే.. పెంచిన హీరోయిన్‌ మాత్రం రష్మికానే. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిందట. లాస్ట్‌ మూవీకి తీసుకున్నదానికి డబుల్‌ పైన ఇస్తేనే సైన్‌ చేస్తానంటోందట…

ఛలో.. గీత గోవిందం వంటి రెండు హిట్స్‌ తర్వాత రష్మిక స్టార్ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది. ఇంతలో దేవదాస్‌… డియర్‌కామ్రేడ్‌ ఫ్లాపులతో కాస్త నిరాశపడ్డా.. సరిలేరునీకెవ్వరు.. భీష్మ వంటి హిట్స్‌తో క్రేజ్‌ పెంచుకుంది రష్మిక. ఈమధ్యనే ‘మిషన్‌ మజ్ను’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేసింది. తమిళ హీరోల కన్ను కూడా ఈ అమ్మడిపై పడింది. ఇలా ఆఫర్స్‌ పెరగడంతో.. రెమ్యునరేషన్‌ కూడా పెంచేసింది రష్మిక.

సరిలేరునీకెవ్వరు షూటింగ్‌ సమయంలో రష్మిక పుష్ఫకు సైన్‌ చేసి… 85 లక్షలతో సరిపెట్టుకుంది. హిట్స్‌ తర్వాత ఓకె చేసిన ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు ‘మూవీ కోసం రెండు కోట్లు డిమాండ్‌ చేస్తే.. కోటి 75 లక్షలకు ఫైనల్‌ అయింది.

వరుసగా రెండు సినిమాలు హిట్‌.. హిందీ ఆఫర్‌తో రష్మిక రేంజ్‌ పెరిగింది. అంతకుమించి రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తోందట. గతంలో కోటి దాటని ఈ అమ్మడి పారితోషికం.. రెండున్నర కోట్లకు చేరింది. అయితే ఈ అమ్మడు అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్దంగా లేకున్నా.. గోల్డెన్‌ లెగ్ ముద్రతో ఊరిస్తోంది.

TOP STORIES

మీరు చేసే జాబ్ మీకు హ్యాపీగా అనిపించాలంటే వీటిని అనుసరించండి..!

మనం చేసే పని వల్ల మనకి ఆనందం మాత్రమే కలగాలి. ఇష్టపడుతూ జాబ్ చేయడం వల్ల ఫ్రస్ట్రేషన్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం లాంటివి ఉండవు. అలానే ఎప్పుడూ...