అఖిలప్రియ విడుదల ఆలస్యం !

Join Our Community
follow manalokam on social media

అఖిలప్రియ విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల ప్రియ విడుదల సందర్భంగా చంచల్ గూడ జైల్ వద్ద ఆళ్లగడ్డ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుండి జైలు వద్ద కార్యకర్తలు పడిగాపులు గాస్తున్నారు. బెయిల్ ఆర్డర్ వచ్చినప్పటికీ ఇంకా విడుదల పై జాప్యం జరుగుతోందని అంటున్నారు. అఖిల ప్రియ రీలీజ్ ఆర్డర్ కోసం న్యాయవాదులు ఎదురు చూస్తున్నారు. చంచల్ గూడ జైల్ వద్ద భారీగా కార్యకర్తలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బోయిన్‌ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియకు… షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సికింద్రబాద్‌ కోర్టు. 10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి సోమవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి సంతకం చేయాలని చెప్పింది. హైదరాబాద్‌ నగరాన్ని విడిచి ఎక్కడికీ వెళ్ళడానికి వీల్లేదని కోర్టు ఆదేశాలు జారీచేసింది.

TOP STORIES

మీరు చేసే జాబ్ మీకు హ్యాపీగా అనిపించాలంటే వీటిని అనుసరించండి..!

మనం చేసే పని వల్ల మనకి ఆనందం మాత్రమే కలగాలి. ఇష్టపడుతూ జాబ్ చేయడం వల్ల ఫ్రస్ట్రేషన్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం లాంటివి ఉండవు. అలానే ఎప్పుడూ...