రేపు తిరుమలకు రాష్ట్రపతి.. అంతటా కరోనా అలెర్ట్  !

-

రేపు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ వస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్ భరత్ గుప్తాలు పరిశీలించారు. రాష్ర్టపతి పర్యటన నేపథ్యంలో ఘాట్ రోడ్డులో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కల్వర్టుల వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను  పూర్తి చేశామని, కోవిడ్ నిభందనలు అనుసరించి రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేశామని  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఇక  బ్రహ్మోత్సవాలలో సీఎం జగన్ పర్యటనలో ఎదురైన అనుభవాలు నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనలో నిబంధనలు కఠినతరం చేసింది టీటీడీ. రాష్ట్రపతి పర్యటన లో పాల్గొనే ఉన్నతాధికారి మొదలు క్రింద స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అర్చకులను కూడా ఇందుకు మినహాయించలేదు టీటీడీ. కోవిడ్ టెస్టులో నెగటివ్ వచ్చిన వారే రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news