తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ఆ మధ్య ప్రకటించారు. దీంతో గత ఆరేళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యమంత్రి ప్రకటన ఊరటనిచ్చింది. అయితే కొత్త రేషన్ కార్డు కావాలంటే అడ్రస్ ప్రూఫ్, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి చిరునామాకు సంబంధింత పత్రం సమర్పించాలి. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, కుటుంబ యజమాని తో దిగిన ఫోటో సమర్పించాల్సి ఉంటుంది.
అలాగే గ్రామాల్లో ఏడాదికి 1.6 లక్షలు, పట్టణాల్లో ఏడాదికి రెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు కార్డు పొందేందుకు అర్హులు. వారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం దాన్ని తహసీల్దార్ ఆఫీస్ లో సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డుల వలన చాల లాభాలు ఉంటాయి. సబ్సిడీ ధరకు రేషన్ సరుకులను పొందడమే కాదు. ఆరోగ్యశ్రీ, పలు రకాల ప్రభుత్వ కార్యక్రమాలకు రేషన్ కార్డు మూలంగా మారింది.