అలెర్ట్ : ఈ నెల 30 లోపు అప్డేట్ చేయకుంటే మీ రేషన్ కట్ !

-

అదేంటి అని టెన్షన్ పడుతున్నారా ? అవును పడాల్సిన విషయమే మరి. రేషన్ కార్డు ద్వారా అనర్హులు కూడా రేషన్ అందుకుంటున్నారని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం. నిజమయిన లబ్ధిదారులను గుర్తించి వారికి మాత్రమే రేషన్ అందేలా చేస్తోంది. ఈ ప్రక్రియలో ఇప్పటికే దేశవ్యాప్తంగా 4.9 కోట్ల నకిలీ రేషన్ కార్డులను గుర్తించి రద్దు చేసింది కూడా. అయితే రాష్ట్రం జారీ చేసే రేషన్ కార్డులు కాకుండా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ జారీచేసిన రేషన్ ని కూడా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద లబ్ధిదారులకు అందిస్తున్నారు.

అయితే అవి నిజంగా పేదలకు వెళుతున్నాయా ? అనేది గుర్తించడానికి కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా వెరిఫికేషన్ చేస్తున్నాయి. అందుకే ఒక వేళ మీరు గానీ మీ కుటుంబ సభ్యులు గానీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డులు అనుసంధానం చేయకకపోతే మీ రేషన్ కార్డు కూడా రద్దు కాబడే అవకాశం ఉంది. రేషన్ కార్డు దారులు తమ తమ రేషన్ కార్డు ఆధార్ కార్డు తో లింక్ చేయడానికి ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. నవంబర్ 30 వరకూ అనుసంధానం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఆధార్ గనుక అనుసంధానం చేయకాపోతే ఆ రేషన్ కార్డుదారులకు ఇకనుంచి రేషన్ సరుకులు ఇవ్వడం కుదరదని కేంద్రం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news