సూర్యాపేటలో ఆసక్తికర ఘటన.. సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మహిళ

-

మంత్రి కేటీఆర్‌ నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే.. ఈ నేపథ్యంలోనే దళితబంధు లబ్దిదారులకు మంత్రి కేటీఆర్‌ చెక్కులను అందజేశారు. అయితే.. ఓ దళిత మహిళ ర‌త్నమ్మ వేదికపైకి వచ్చి చెక్కు తీసుకుంటున్న సమయంలో మాట్లాడిన మాటలు అందరినీ ఆకర్షించడమే కాకుండా.. కన్నీరు కూడా పెట్టించాయి. కాంగ్రెస్‌ హయాంలో ఎదుర్కొన్న సమస్యలను అద్దం పడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలను పొగుడుతూ.. సీఎం కేసీఆర్‌ను తన తండ్రిగా భావిస్తున్నట్లు ర‌త్నమ్మ వ్యాఖ్యానించారు.

‘గ‌తంలో 30 సంవ‌త్స‌రాలు నేను, నా భ‌ర్త చెప్పులు కుట్టి బ‌తికాం. డ‌బ్బులు ఉన్నోళ్లకాడ బానిస‌త్వం చేశాం. ఈ బానిస‌త్వం నుంచి విముక్తి ఎప్పుడు క‌లుగ‌త‌ది దేవుడా..? ఏ ప్ర‌భుత్వ‌మైనా స‌హాయం చేయ‌క‌పోతారా..? ఏ మంత్రైనా స‌హాయం చేయ‌క‌పోతారా..? ముఖ్య‌మంత్రులున్న‌రు.. మంత్రులున్న‌రు. మంత్రి ఎట్ల ఉంట‌డో కూడా నాకు తెలియ‌దు. ఓటు అడ‌గ‌డ‌మే త‌ప్పా.. వారికి మా బాధ‌లు, క‌ష్టాలు వాళ్ల‌కు తెల్వ‌దు. మాదిగోడు అంటేనే హీన‌మైన చూపు చూసిన ప్ర‌భుత్వం అది(కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి). ఆ ప్ర‌భుత్వాల్లో క‌రెంట్‌కు ఏడ్సినం.. నీళ్ల‌కు ఏడ్సినం. ఇదే బిందెలు ప‌ట్టుకొనివ‌చ్చి మున్సిపాలిటీ ఆఫీసుల కాడ ధ‌ర్నాలు చేసినం. అయ్యా మాకు ప‌దివేల సహాయం చేయండి.. ఈ బానిస‌త్వం నుంచి మ‌మ్ముల్ని విముక్తి చేయండ‌ని ఎన్నోసార్లు అర్సినం. ఈ క‌ష్టం చేసుకుంట‌నే నా న‌లుగురి బిడ్డ‌ల‌ను చ‌దివిచ్చిన‌. నా భ‌ర్త తాగి తాగి చ‌నిపోయిండు. నేను చేసిన ప‌ని నా బిడ్డ‌ల‌కు పెట్ట‌కు అని చ‌నిపోయేట‌ప్పుడు నా భ‌ర్త చెప్పిండు. ఇప్పుడున్న ప్ర‌భుత్వం మ‌న‌కు చేయ‌దు స‌హాయం. మ‌న బ‌తుకులు మార్చేందుకు ఏ దేవుడో వ‌స్తే నా బిడ్డ‌ల బ‌తుకు మారుత‌ది అని నా భ‌ర్త అన్న‌డు. నా భ‌ర్త ఆశ‌యానికి నా పిల్ల‌ల‌ను ప‌నికి పెట్ట‌లేదు. రోడ్డు మీద ఎక్కి ప‌ని చేస్తుంటే.. ఏ మంత్రి కూడా, ఏ అధికారి కూడా మాకు స‌హాయం చెయ్య‌లే. ప‌ది రూపాయాల స‌హాయం చేసినోళ్లు లేరు. ఇప్పుడు ఇల్లు ఇస్తాం. మీకు ప‌న్నెండు ల‌క్ష‌లిస్తాం అంటుండు. అప్పుడు ఆ ప‌దివేలు ఎందుకు ఇవ్వ‌లేదు ఆ వెధ‌వ‌. ఆ బద్మాష్ ఎందుకివ్వ‌లే మాకు. మాకు స‌హాయం చేయ‌కుండా చాలా బాధ పెట్టిండ్రు. కేసీఆర్ వ‌చ్చినంక ఒక ద‌ళిత కుటుంబానికి ప‌ది ల‌క్ష‌ల రూపాయాలు ఇవ్వాల‌న్న ఆలోచ‌న క‌లిగిన ఏకైక ముఖ్య‌మంత్రి మ‌న కేసీఆర్. కేసీఆర్‌కు బ‌తికినంత కాలం రుణ‌ప‌డి ఉంటాం. ఈ ద‌ళిత‌బంధు సాయంతో చెప్పుల షాపు పెట్టుకుంటా. నా ఇద్దరు కొడుకుల‌కు ఉపాధి క‌ల్పిస్తా. నేను ఒక‌ళ్ల మీద ఆధార‌ప‌డ‌కుండా బ‌తుకుతా. నాకు స‌హాయం చేశారు నా తండ్రి కేసీఆర్ అని ర‌త్నమ్మ ఆనంద‌భాష్పాలు రాల్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version