రావ‌ణాసుర అప్‌డేట్ : రామ్‌గా సుశాంత్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

-

మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు టైటీల్ గా రావ‌ణాసుర అని ఫిక్స్ చేశారు. ఈ సినిమా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతుంది. కాగ ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలో అక్కినేని యువ‌ హీరో సుశాంత్ నటిస్తున్నాడ‌ని చిత్ర బృందం ప్రక‌టించింది. అంతే కాకుండా ఈ సినిమాలో సుశాంత్ ఫ‌స్ట్ లుక్ ను కూడా చిత్ర బృందం విడుద‌ల చేసింది.

ఈ రావాణాసుర సినిమాలో అక్కినేని సుశాంత్ రామ్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. రామ్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసిన చిత్ర బృందం.. అత‌ను రామ్ అయిన‌ప్ప‌టికీ.. హీరోలు ఉనికిలో లేరు.. కానీ రాక్ష‌సులు ఉన్నారు అనే క్యాప్ష‌న్ ను జోడించింది. అలాగే రామ్ పాత్ర‌లో సుశాంత్.. పొడ‌వాటి గ‌డ్డం, జట్టు క‌లిగి ఉన్నాడు. అలాగే చాలా బ‌లంగా క‌నిపిస్తున్నాడు.

 

అయితే ఈ సినిమాలో సుశాంత్ నెగిటివ్ రోల్ క‌నిపించే విధంగా ఈ లుక్ ఉంది. కాగ సుశాంత్ హీరో పాత్రలే కాకుండా ఇత‌ర సినిమాల‌లో కీల‌క ప్రాత్ర‌ల‌లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే అల్లు అర్జున్ అలా వైకుంఠ‌పూరంలో.. అనే సినిమాలో ఒక కీలక పాత్ర‌లో సుశాంత్ క‌నిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news