సినిమా విడుదల అనే పదం ఇప్పుడు ఓ పెద్ద బ్రహ్మ పదార్థంలా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రతి శుక్రవారం థియేటర్ల దగ్గర జాతర ఉండేది. ఇప్పుడు కూడా థియేటర్ల దగ్గర జాతర ఉండాలంటే వరుస సినిమాలు విడుదలకు నోచుకోవాలి. ఆవిధంగా జరిగేందుకు ఆస్కారం ఉండేలా పరిణామాలు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ విధంగా లేవు. అనుకున్నవన్నీ జరిగేందుకు వీల్లేకుండా కరోనా దాడి కొనసాగుతోంది.
ఈ దశలో ఈ రోజు (ఈ శుక్రవారం) ఖిలాడి సినిమా విడుదలవుతోంది.రమేశ్ వర్మ దర్శకత్వంలో డింపుల్, మీనాక్షీ హీరోహీరోయిన్లుగా మాస్ మహరాజా నటించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి చేయనుంది. ఇంకా చెప్పుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 1600 థియేటర్లలో మాస్ మహరాజా పూనకాలు ప్రారంభం కానున్నాయి.
ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు అనుగుణంగా సినిమా విడుదల అవుతున్నప్పటికీ,టాక్ బాగుంటే మంచి వసూళ్లు దక్కించుకోవడం ఖాయం. రవితేజ గతంలో నటించిన క్రాక్ సినిమా భారీ విజయం దక్కించుకోవడంతో ఈ సినిమాపై కూడా మంచి హోప్స్ ఉన్నాయి. అభిమానుల ఆశలకు అనుగుణంగానే తాను ఈ సినిమాలో నటించానని, కథ పరంగా చాలా ఉన్నతంగా ఉంటుందని కూడా రవితేజ అంటున్నారు.
కోనేరు సత్యనారాయణతో కలిసి ఈ సినిమాను దర్శకుడు రమేశ్ వర్మ పెన్మత్స రూపొందించడం విశేషం. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు.ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుకలు అత్యంత సామాన్యంగా నిర్వహించి, ముగించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ 24.80 కోట్ల రూపాయలకు జరిగిందని తెలుస్తోంది. సినిమా కొనుగోలు చేసిన బయ్యర్లు, ప్రదర్శించే ఎగ్జిబిటర్లు సేఫ్ జోన్ లో ఉండాలంటే 25.50 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. అయితే ఆఖరులో సినిమా అమ్మకాల్లో కొంచెం రేటు తగ్గుదల కనిపించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రెండు కోట్ల మేరకు తగ్గిందని కూడా తెలుస్తోంది.
ఏరియాల వారీగా అమ్మకాల వివరాలు
👉Nizam: 8Cr
👉Ceeded: 2.80Cr
👉Andhra: 8.70Cr
AP-TG Total:- 19.50CR
👉KA+ROI: 2.10Cr
👉OS: 1.2Cr
Total WW: 22.80CR