వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో రోహిత్ తో సహా ఆటగాళ్లు అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఇక డ్రెసింగ్ రూమ్ కు చేరుకున్న ప్లేయర్స్ చాలా డల్ గా పూర్తి అసంతృప్తితో ఉన్న సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ప్లేయర్స్ కు దైర్యం చెప్పడం గొప్ప విషయం అని చెప్పాలి. ఈ విషయంపై మాజీ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.. అంత పెద్ద టోర్నమెంట్ లో ఫైనల్ ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలియని విషయం కాదు, ప్లేయర్లు అంతా నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో దేశ ప్రధాని మోదీ వారి బాధను పంచుకోవడానికి అక్కడకు రావడం చాలా పెద్ద విషయం అంటూ రవిశాస్త్రి పొగడ్తలతో ముంచెత్తారు.
ఇలా చేయడం వలన ఆటగాళ్ల మనసు తేలికపడి మాములుగా అవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అంటూ రవిశాస్త్రి సాటి క్రికెటర్ గా వారి బాధను అర్ధం చేసుకున్నాడు.