రవిశాస్త్రి: WTC ఫైనల్ లో విజయం భారత్ దే… !

-

జూన్ 7 వ తేదీన ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయాన్ని సాధించడానికి రెండు జట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్ పై తాజాగా మాజీ ఇండియా కెప్టెన్ మరియు కామెంటేటర్ రవిశాస్త్రి ఒక విషయం చెప్పాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోగి దిగుతోంది అని చెబుతూనే.. అయినా టీం ఇండియా విజయాన్ని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆస్ట్రేలియా దాదాపుగా మూడు నెలల నుండి విశ్రాంతి తీసుకుని మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాగా… ఇండియా మాత్రం ఇటీవల ముగిసిన ఐపీఎల్ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఇప్పటికే గాయాల బారిన పడి కొందరు కీలక ప్లేయర్లు ఈ మ్యాచ్ కు దూరం అయ్యారు.

మరి ఏ లెక్కన రవిశాస్త్రి ఇండియా గెలుస్తుందని అంటున్నారు అంటూ అభిమానులు తలలు పీక్కుంటున్నారు. మరి ఫలితం ఎవరికీ అనుకూలంగా వస్తుందో తెలియాలంటే మ్యాచ్ వరకు ఆగాలి.

Read more RELATED
Recommended to you

Latest news