ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ రైల్ ప్రమాద ఘనత ఎందరినో కలచివేస్తోంది. ఈ ఘటనలో 300 మందికి పైగా మరణించినట్లు ప్రభుత్వం తెలుపుతోంది. ఇంకా మృతదేహాలను బోగీల నుండి తీయవలసి ఉందని అధికార వర్గాల నుండి సమాచారం అందుతోంది. కాగా ఫైర్ సర్వీసెస్ డీజీ సుధాన్సు ఈ ఘటనకు సంబంధించి ఒక కీలక విషయం చెప్పారు. ఈయన ఈ ప్రమాదంలో మరణించిన మృతదేహాలను తొలగించడానికి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని మృతదేహాలను తీయదనాయికి క్రేన్ లను సైతం వాడుతున్నట్లు సుధాన్సు చెప్పారు. ఇక ఈయన మాట్లాడుతూ నా జీవితంలో ఎప్పుడూ ఈ స్థాయిలో నేను మృతదేహాలను చూడలేదని చెప్పారు.
ఇలా జరగడం చాలా బాధగా ఉందని చెప్పారు, ఇంకా బోగీల మధ్యలో కొన్ని శవాలు ఇరుక్కుని ఉన్నాయని వాటిని బయటకు తీయడానికి మరికొన్ని ట్రాన్స్ లను ఉపయోగిస్తున్నామన్నారు.