Balayya: క్రేజీ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరోలుగా రవితేజ, బాలకృష్ణ!

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో సరికొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు. 1980, 90లలో సీనియర్ హీరోలు తరచుగా మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు. రజనీకాంత్, శోభన్ బాబు, కమల్ హాసన్, రజనీకాంత్ ఇలా పలువురు సినీ హీరోలు చిత్రాలు చేసేశారు. కానీ, కాలం మారింది. హీరోలు అలా చేయడానికి అస్సలు మందుకు రాని పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. అటువంటి తరుణంలో ఇద్దరు సూపర్ స్టార్స్ ను పెట్టి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తీశారు టాలీవుడ్ జక్కన్న.

బాక్సాఫీసు వద్ద ప్రస్తుతం RRR సత్తా చాటుతోంది. అలా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి మళ్లీ బీజం వేశారు రాజమౌళి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మరో క్రేజీ అండ్ బిగ్టెస్ట్ మల్టీస్టారర్ రూపొందుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అది అఫీషియల్ న్యూస్ అయితే ఇక సినీ లవర్స్ పండుగ చేసుకోవచ్చని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్, బజ్ ప్రకారం.. మాస్ మహారాజ రవితేజ, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోలుగా ఓ చిత్రం రూపొందుతున్నదని టాక్.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రజెంట్ ‘ఎఫ్‌3’ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ప్లస్ ప్రమోషన్స్ ప్లాన్ లో బిజీగా ఉన్నారు. ఒకసారి ఆ చిత్రం పూర్తయితే కనుక నెక్స్ట్ మూవీ పనులు స్టార్ట్ చేస్తారట. అది మల్టీస్టారర్ అయితే బాగుంటుందని అనుకున్నారట.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు వినికిడి. ఇందులో బాలకృష్ణతో పాటు రవితేజ హీరోలుగా నటిస్తారని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లో దీనిపైన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి.. ఈ వార్తలు నిజమవుతాయా.. లేదా .. అలానే ఉండిపోతాయా..

Read more RELATED
Recommended to you

Latest news