రవితేజ: ఎవ్వరూ సినిమా ప్లాప్ కావాలని తీయరు..!!

-

రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న చిత్రం ధమాకా,నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తోంది.. భీమ్స్ సంగీతం అందించిన ధమాకా మూవీ ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది.సందర్బంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తూ ఆసక్తి పెంచుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. హీరో రవితేజ ఈ హిట్ చాలా అవసరం. అందుకే అనేక  ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అలాగే తాను ఎంతో మంది యంగ్ డైరెక్టర్ లకు అవకాశం ఇచ్చాడు. వాటిలో కొన్ని ప్లాప్ అవుతున్నా కూడా మరింత మంది యంగ్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ వెళుతూనే ఉన్నాడు. దీనిపై తాజాగా ఇంటర్వ్యూ లో రవితేజ జవాబు ఇచ్చాడు.

ఒక మనిషి టాలెంట్‌ ఒక ఫ్లాప్‌ను బట్టి తగ్గిపోయి, ఓ హిట్‌ని బట్టి పెరిగిపోయి.. ఆ లెక్క కరెక్ట్‌ కాదు. నా లెక్క కూడా ఇది కాదు. ఓ దర్శకుడు ఓసారి అనుకున్నది క్లిక్‌ అవుతుంది మరోసారి కాదు. సినిమా సక్సెస్‌ అవ్వలేదు కదా అని దర్శకుడి సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్‌ కాదు. ఎవ్వరూ ప్లాప్ కావాలని తీయరు, అందరూ హిట్ కోసమే కష్టపడతారు. ఒక్కో సారి ఐడియా హిట్ అవుతుంది, మరో సారి కాదు అంతే అంటూ చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news