ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర సందడి చేయని హీరోలు..!!

-

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు మంచి విజయాలను అందుకున్నారు. మరి కొంతమంది భారీ డిజాస్టర్ లను చవి చూశారు. కొంతమంది హీరోలు ఏడాదికి ఒక సినిమా అంటూ విడుదల చేస్తున్నా. ఈ ఏడాది మాత్రం ఏ ఒక్క సినిమాను కూడా విడుదల చేయని స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు. ఇంతకీ ఏ హీరోలు ఈ ఏడాది థియేటర్లలో కనిపించలేదో వాటి గురించి తెలుసుకుందాం.

1). బాలయ్య:Nandamuri Balakrishna's Film Titled 'Veera Simha Reddy'
గత సంవత్సరం అఖండ సినిమాతో పలు రికార్డులను సైతం సృష్టించిన బాలయ్య ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర పలకరించలేదు. ముఖ్యంగా బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.

2). సాయి ధరమ్ తేజ్:Sai Dharam Tej regains consciousness; continues to recuperate at the hospital | Telugu Movie News - Times of India
కెరియర్ మొదట్లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది ఒక్క సినిమాని కూడా విడుదల చేయలేదు. గత ఏడాది ఆక్సిడెంట్ కారణంగా కాస్త విశ్రాంతి ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

3). అఖిల్:EXCLUSIVE: Akhil Akkineni would love to play Virat Kohli on screen: 'He has influenced me in a lot of ways' | PINKVILLA
కెరియర్ మొదటి నుంచి వరుస ప్లాప్లను చవిచూసిన అఖిల్.. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇక తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ ఏడాది కూడా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు.

4). అల్లు అర్జున్:Telugu star Allu Arjun tests positive for Covid, under home quarantine - The Economic Timesపుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన అల్లు అర్జున్ ఈ ఏడాది మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. వాస్తవానికి పుష్ప-2 సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత సినిమా కథపై భారీ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా కాస్త ఆలస్యం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news