ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే ఇది మీకోసమే. మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకావల్సిందే. అయితే ఆర్‌బీఐ సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ కస్టమర్లను మరోసారి హెచ్చరిస్తోంది.
అయితే ప్రపంచంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇటీవల కాలంలో సైబర్ ఎటాక్ జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ధనికులైన బిల్ గేట్స్, ఎలాన్ మాస్క్ వంటి పలువురి ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ చేశారు. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ కస్టమర్లను జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి సైబర్ క్రైమ్స్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి వాటితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అయితే ఆర్‌బీఐ సోమవారం ఒక ట్వీట్ చేసింది. సమాజంలో సైబర్ స్కామ్ పెరుగుతూ వస్తున్నాయని, బ్యాంక్ కస్టమర్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. డబ్బును సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని ఆర్‌బీఐ తెలియజేసింది. ఐడెంటిటీ థెఫ్ట్స్‌తో జాగ్రత్త’ అని ఆర్‌బీఐ ట్వీట్ చేశారు. అలాగే ఒక జిఫ్ ఫైల్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో బ్యాంక్ ఖాతాదారులు అనుసరించాల్సిన విధానాలను పేర్కొంది.
వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఎవ్వరికీ షేర్ చేయవద్దని ఆర్‌బీఐ పేర్కొంది. యూపీఐ పిన్ సహా ఇతర బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలియజేయవద్దని సూచించారు. ఈ వివరాలనతో మోసగాళ్లు ఎలా బ్యాంక్ ఖాతాదారులను మోసం చేస్తారో కూడా తెలిపింది. ఈ వివరాలతో మోసగాళ్లు వర్చువల్ పేమెంట్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తస్కరిస్తారని తెలియజేశారు.
ఖాతాదారులు ఐడెంటిటీ థెఫ్ట్‌తో జాగ్రత్తగా ఉండాలని ఆర్‌బీఐ తెలిపింది. నమ్మకమైన సైట్లలో షాపింగ్ చేయడం, సురక్షితమైన నెట్‌వర్క్ ఉపయోగించడం, ఏటీఎం సహా ఇతర పరికారల్లో కార్డ్ రీడర్స్ ఉన్నాయో.. లేదో చెక్ చేసుకోవడం వంటి చేయాలని తెలియజేసింది. పబ్లిక్ ప్లేసుల్లో చార్జింగ్ పెట్టుకోవద్దని తెలియజేశారు. అలాగే పబ్లిక్ వైఫై ఉపయోగిస్తే.. వీపీఎన్ నెట్‌వర్క్ ఉపయోగించాలని తెలియజేసింది.