తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 45,076 మంది కరోనా బారిన పడగా 415 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లాలో సోమవారం 36 మందికి కరోనా సోకింది. వీరిలో 13 మంది పోలీస్ శాఖ సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, జిల్లాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ నుంచి రాకపోకలు జరపడం వల్లే కేసులు పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
జగిత్యాల డీఎస్పీతో సహా 13 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. దీంతో డిపార్ట్ మెంట్ మొత్తాన్ని హోం క్వారంటైన్ చేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పీ.శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులకు చికిత్స అందిస్తున్నట్లు, ఐసోలేషన్ కిట్లు, ఇతర పరికరాలు సమకూర్చామన్నారు. ఇప్పటి వరకూ జగిత్యాల జిల్లాలో 80 యాక్టిక్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. పోలీసు శాఖలో కరోనా కేసులు పెరగడంతో సిబ్బంది ఎవరూ ఫంక్షన్లు, పార్టీలు హాజరు కావొద్దని, సామాజిదూరం పాటించడం, మాస్కులు ధరించాలని కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి సూచించారు.