రామ్ చరణ్ మరో లుక్ లీక్..RC 15లో ట్రాఫిక్ పోలీస్‌తో గొడవపడుతున్న హీరో

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం RC 15కు లీకుల బెడద తప్పడం లేదు. వరుసగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరలవుతున్నాయి కూడా. తాజాగా ఏపీలోని వైజాగ్ షూట్ కు సంబంధించిన ఫొటో ఒకటి లీకయింది.

సదరు ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సొసైటీని ఆలోచింపజేసే విధంగా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్చర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు.

IAS, IPS ఆఫీసర్ గానూ, పొలిటీషియన్ గానూ కనబడతారని అంటున్నారు. షార్ట్ టెంపర్ ఉన్న యువకుడిగానూ రామ్ చరణ్ కనిపిస్తాడని తాజాగా వార్తలొస్తున్నాయి. RC15 షూట్ నిమిత్తం రామ్ చరణ్ ఏపీలోని వైజాగ్ కు వచ్చాడు. అక్కడ ట్రాఫిక్ పోలీస్ తో గొడవ పడే సీన్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది.

బ్లాక్ కలర్ కోట్, లోపల రెడ్ కలర్ టీ షర్ట్ ధరించి ట్రాఫిక్ పోలీస్ తో రామ్ చరణ్ గొడవ పడుతున్నట్లు ఫొటోలో కనబడుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బ్యూటిఫుల్ కియారా అద్వానీ నటిస్తోంది. జయరాం, శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version