జంట నగరాల్లో18 హాస్పిటల్స్ లలో ఈ నెల 12న.. 5 రూపాయిల మీల్స్ ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. నిజాం కాలంలో పెట్టిన హాస్పిటల్స్ తో వైద్యం అందిస్తున్నాం… ఇప్పుడు కేసీఆర్ హయాంలో కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రు. 2.15 కోట్ల విలువ చేసే సిటీ స్కాన్ ను ప్రారంభించారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ తో 30 నుంచి 56శాతానికి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవాలు పెరిగాయని.. సి సెక్షన్ లు తగ్గించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 11 న 10 రేడియాలజి ల్యాబ్ లు మంత్రులు ప్రారంభిస్తారని.. మరో 2 రాబోతున్నాయి.. మొత్తం 12 సెంటర్స్ ప్రారంభిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని విమర్శించారు.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో పాటు నిమ్స్ లో కొత్త బిల్డింగ్ అని.. అవయవాల మార్పిడి ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో ఉచితంగా జరుగుతున్నాయని చెప్పారు. నార్మల్ డెివరీ లకు ఇంటెన్సివ్ లు ప్లాన్ చేస్తున్నాము.. రాష్ట్రంలో 39 శాతం మాత్రమే గోల్డెన్ హవర్లో తల్లి పాలు అందుతున్నాయి.. ఈవెనింగ్ ఒపి కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అవసరమయిన సర్జరీలు , టెస్ట్ లు చేస్తే… మెడికల్ కౌన్సిల్ కు రిఫర్ చెయ్యడానికి వెనకాడను… వైద్యులపై యాక్షన్ ఉంటుంది.. మెరుగైన వైద్యమే మా ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.