అక్టోబర్ 21న చరణ్ శంకర్ ల సినిమా షురూ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో పాటు చరణ్ ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ శంకర్ సినిమా లో నటిస్తున్నట్లు ప్రకటించారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగులోనూ ఎంతో పేరు సంపాదించుకున్నారు.

దాంతో రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 21 నుండి ప్రారంభం కాబోతునట్లు సమాచారం. అంతేకాకుండా సినిమా షూటింగ్ పుణేలో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ను కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి చరణ్ శంకర్ ల కాంబో లో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.