Ipl 2021 : ప్లే ఆఫ్స్ లో ఈ జట్ల మధ్య బిగ్ ఫైట్

ఐపీఎల్ 2021 రెండో సీజన్ ముగింపు దశకు వచ్చింది. నిన్నటి వరకు లీగ్ దశ మ్యాచ్లు పూర్తి కాగా.. ఇక రేపటి నుంచి.. ప్లే ఆప్స్ మ్యాచులు ప్రారంభంకానున్నాయి. క్వాలిఫైయర్ 1 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రేపటి రోజున జరగనుండగా… సాయంత్రం… 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఇక ఈ మ్యాచ్ దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుంది. అలాగే… ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా కోల్కత్తా నైట్ రైడర్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య ఈనెల 11వ తేదీన బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ షార్జాలో ని ఇంటర్నేషనల్ స్టేడియం లో జరగనుంది. అయితే ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటికి వెళ్లడం ఖాయం. అలాగే గెలిచిన జట్టు… క్వాలిఫైయర్ 1 లో ఓడిన జట్టుతో తలపడనుంది. ఇంకా ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 కు ఎంపిక అవుతుంది.