రేవంత్.. బిజెపి కోవర్ట్.. డబ్బులు తీసుకునే బ్రోకర్ : కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ హుజురాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన టిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “కరీంనగర్ గడ్డ మీద ఖడ్గం తీసింది నువ్వు కాదా ? ఉస్మానియా యూనివర్సిటీలో గన్ను తీసి గొడవకు దిగింది నువ్వు కాదా ? రేవంత్ అంటూ నిప్పులు చెరిగారు టిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి.


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా ఉంటూ బీజేపీ పార్టీ ఈటల గెలుస్తాడని ఎలా అంటావ్ ? అని ఫైర్ అయ్యారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్ తీసుకువస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సవాల్ విసిరారు. బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డి కోవర్ట్ అని.. రేవంత్ రెడ్డి ఒక డబ్బులు వసూలు చేసే బ్రోకర్ అని ఫైర్ అయ్యారు. “నువ్వు చూస్తునే ఉండు నేను ఎలా ఎంఎల్ సి అవుతానో.. నేను ఎంఎల్ సి ఐ హుజురాబాద్ ను ఎలా అభివృద్ధి చేస్తానో చూడు” అంటూ చురకలు అంటించారు కౌశిక్ రెడ్డి. ఓటుకు నోటు కేసు లో అడ్డంగా దొరికిన రేవంత్ కాంగ్రెస్ పార్టీకి అదృష్టమో ?మరీ దుర దృష్టమో ? అంటూ ఎద్దేవా చేశారు.