భారతీయ సనాతన ధర్మం అందరికీ అర్థం కావడానికి వేదాలను సామాన్యులకు కథల రూపంలో అందించినవే పురాణాలు. ఈ పురాణాలలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసం, ధర్మం, సత్యం, మనషి చేయాల్సినవి, చేయకూడనవి ఇలా అనేక విషయాలను కథల రూపంలో వివరించినవే పురాణాలు.
అయితే వీటన్నింటిని ఒకేచోట లభ్యమయ్యేలా ప్రీగురుకుల్ వారు చేశారు.. విశిష్టమైన పురాణాలనూ, తత్సంబంధమైన గ్రంథాలనూ… మొత్తం 49 పుస్తకాలు ఇప్పుడు ఒకే చోట లభ్యమవుతున్నాయి…. అదీ తెలుగులో. పిడిఎఫ్ ఫార్మట్లో ఉన్న ఈ పుస్తకాలను ఫ్రీగురుకుల్.ఓఆర్జీ’ అందిస్తోంది వాటిని www.freegurukul.org అనే లింక్ ద్వారా కావాల్సిన పుస్తకాలను చదువుకోవచ్చు. అవసరమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పురాణేతిహాసాలు, కావ్య నాటకాలు, భక్తులు, కవుల జీవిత చరిత్రలు, బాలసాహిత్యం, వక్తిత్వ వికాస గ్రంథాలు.. ఇలా దాదాపు 3,500 తెలుగు పుస్తకాలు, అలాగే ఆడియో, వీడియో ప్రవచనాలు కూడా www.freegurukul.org లింక్లో లభ్యం అవుతాయి
– శ్రీ