తెలంగాణాలో కరోనా వైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చేసిన సంకేతాలే కనపడుతున్నాయి. రోజు రోజుకి అక్కడ కరోనా తగ్గుముఖం పడుతుంది. డబుల్ డిజిట్ నుంచి సింగల్ డిజిట్ కి కరోనా కేసులు తగ్గిపోవడం ఆశ్చర్య౦ కలిగిస్తుంది. కరోనా లక్షణాలు కూడా ఎవరికి కనపడటం లేదు. ఇక దాదాపు చాలా జిల్లాల్లో అక్కడ కరోనా ప్రభావం లేదని అధికారులు చెప్తున్నారు. 13 జిల్లాల్లో అసలు కరోనా కనపడటం లేదు.
ప్రస్తుతం కరోనా కేసులు లేని జిల్లా రాష్ట్రంలో 13 ఉన్నాయని, ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలు చూస్తే 1. వరంగల్ (రూరల్), 2. యాదాద్రి భువనగిరి 3. వనపర్తి. కరోనా నుంచి కోలుకొని యాక్టివ్ కరోనా కేసులు లేని జిల్లాలు చూస్తే 1. సిద్దిపేట 2. మహబూబాబాద్ 3. మంచిర్యాల 4. నారాయణపేట 5. పెద్దపల్లి 6. భద్రాద్రి కొత్తగూడెం 7. నాగర్ కర్నూల్ 8. ములుగు 9. సంగారెడ్డి 10. జగిత్యాల జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు.
ఇక హైదరాబాద్ లో కూడా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. పాత బస్తీ లో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచిస్తుంది. కరోనా వైరస్ పూర్తిగా తరిమేసే వరకు కూడా వదిలేది లేదని ఎక్కడా కూడా తమ సర్కార్ దీని విషయంలో అలసత్వం ప్రదర్శించేది లేదని స్పష్టంగా చెప్తుంది రాష్ట్ర సర్కార్ ఏపీలో మాత్రం కరోనా పెరుగుతుంది.