ఇంగ్లిష్ మీడియంపై తల్లితండ్రుల కోరిక ఎంత బలంగా ఉందంటే…!

-

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం నిర్ణయం అనేది తల్లితండ్రులకే వదిలేయాలని హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం… ఈ విషయంపై తల్లితండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడు ఆప్షన్ లతో తల్లి తండ్రుల అభిప్రాయాలు తెలుసుకునే పనికి పూనుకుంది. ఈ అభిప్రాయ సేకరణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఈ విషయం ఏపీలో చర్చనీయాంశం అయ్యింది!

ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారానే తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయాన్ని మెజారిటీ తల్లితండ్రులు వ్యక్తం చేశారు. దీంతో తమ పిల్లలు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలనే ఆకాంక్ష వ్యక్తమైంనట్లైంది.

ఈ అభిప్రాయసేకరణలో భాగంగా ప్రభుత్వం మూడు ఆప్షన్స్ ని ఎంచుకుంది! అందులో ఒకటి… తెలుగు తప్పనిసరిగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన కాగా, తెలుగు మాధ్యమంలో మాత్రమే బోధన రెండోది. ఇతర భాషల్లో బోధన మూడో ఆప్షన్‌గా ఇచ్చారు. రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 17,87,035 మంది ఉండగా 17,85,669 మంది తల్లిదండ్రులు తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో మొదటి ఐచ్ఛికాన్ని (తెలుగు తప్పనిసరిగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన) టిక్‌ చేస్తూ 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేయగా.. తెలుగు మీడియం కోరుకున్నవారు 3.05 శాతం మంది ఓటు వేశారు. కాగా ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news