బహిరంగ చర్చకు సిద్ధం..దమ్ముంటే కెసిఆర్ ను ఓయూ కిి రమ్మనండి: రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.రాహుల్ రావడానికి ఇంకా నాలుగైదు రోజుల సమయం ఉన్నా..అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఒకరిపై ఒకరు చేసుకుంటున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.ఇప్పటికే రాహుల్ సభ కోసం ఓయూ వీసీని పర్మిషన్ అడగ్గా..అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తెలంగాణకు, ఓయూ కు రాహుల్ గాంధీ వస్తే..టిఆర్ఎస్ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు.

ఓయూ కు రాహుల్ గాంధీతో పాటు తాము వస్తామని అన్నారు.దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఉస్మానియా యూనివర్సిటీ ని సందర్శించి చూపించాలని సవాల్ విసిరారు.టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, నిరుద్యోగులను నట్టేట ముంచింది అని దీనిపై ఆర్ట్స్ కాలేజీ ముందు తాము బహిరంగ చర్చకు సిద్ధమని, కెసిఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు.రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరులల కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news