స్కూటీ భుజానికెత్తుకున్న రియల్ బాహుబలి.. అసలేమైంది ?

తెలుగులో బాహుబలి ఒక సూపర్ హిట్ సినిమా. ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ భుజాన ఎత్తుకుని నడిచిన సీన్ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి వ్యవహారమే ఒకటి రియల్ గా జరిగింది. అది కూడా హిమాచల్‌ ప్రదేశ్‌ లో.  హిమాచల్ ప్రదేశ్ లో యువకుడు ఏకంగా స్కూటీని ఎత్తుకున్నాడు.

కుల్లూ జిల్లా రాంశిలాలోని గాయమన్‌ వంతెన వద్ద ఓ యువకుడు స్కూటీని ఎత్తుకొని నడుచుకుంటూ తీసుకెళుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సదరు వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు ? ఎందుకు ఆ స్కూటీని ఎత్తుకొని వెళ్తున్నారు అనే అంశాల మీద స్పష్టత లేకపోయినా.. పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంత వరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.