ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో చర్చించాలని సీఎం వైఎస్ జగన్ భావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు షెడ్యుల్ ప్రకారం తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, ఈ పర్యటన వాయిదా పడింది. హోం మంత్రి అమిత్ షా.. నిసర్గ తుపాను ముందస్తు కార్యక్రమాల్లో షా బిజీబిజీగా ఉండడంతో జగన్ టూర్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.
కాగా… జగన్ ఢిల్లీ వెళ్ళడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా, లేక ముఖ్యమంత్రి హోదాలో నిధుల కోసం హస్తినకు వెళుతున్నారా అనే విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో… ఉన్నఫలంగా ఢిల్లీ టూర్ పోస్ట్ పోన్ అంటూ వార్తలు వచ్చాయి! కాగా… ఈ టూర్ లో నిమ్మగడ్డ వ్యవహారం కూడా కీలక భూమిక పోషించబోతుందనే కామెంట్లు కూడా బలంగా వినిపించిన సంగతి తెలిసిందే! ఆ సంగతులు అలా ఉంటే… తిరిగి జగన్ ఢిల్లీ యాత్ర ఎప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది!
బ్రేకింగ్: జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా… కారణం ఇదే?
-