విశాఖలో జగన్ అందుకే దిగారా…?

-

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖ నగరంలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి అని అంటున్నారు పలువురు. ముందు మాట్లాడిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసారు. అలారం మోగింది అని అప్పుడు అందరూ అలెర్ట్ అయ్యారని చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన డీజీపీ గౌతం సవాంగ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ఘటన జరిగిన వెంటనే తమకు డయల్ 100 సమాచారం వచ్చిందని అధికారులు అప్రమత్తం అయ్యారని చెప్పారు. ఆ తర్వాత విశాఖ వెళ్ళిన జగన్ మాట్లాడుతూ… అలారం మోగలేదు మొగి ఉంటే వెంటనే అప్రమత్తం అయ్యే వారు అని చెప్పారు. ఇంతకు అది మొగిందా లేదా అనేది తెలియలేదు. ముగ్గురు మూడు మాట్లాడారు. ఇక ఇది పక్కన పెడితే ప్రభుత్వ అధికారిక మీడియాలో కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి.

అది ఏంటీ అంటే… అసలు లీక్ అయిన వాయువు తీవ్రత ఏమీ ఉండదు అని అక్కడ అంతా బాగానే ఉంటుందని కాకపోతే కాస్త నీరసంగా ఉంటుంది ఒక డిబేట్ లో చెప్పారు. అందుకే కేంద్రం జోక్యం చేసుకుంది అని కూడా అంటున్నారు. ఇక సిఎం కూడా ఈ ఘటన విషయంలో కొందరిని నమ్మడం లేదని సమాచారం. అందుకే ఆయన నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని అడిగినట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news