విజయ్ దేవరకొండ సినిమా నేచురల్ స్టార్ నాని చేతికి .. మరో సూపర్ హిట్ మిస్ చేసుకున్న విజయ్..?

-

ఇండస్ట్రీలో దర్శకుడిగా శివ నిర్వాణ మంచి పేరు సంపాదించుకున్నాడు. తీసిన రెండు సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. నేచురల్ స్టార్ నాని తో తెరకెక్కించిన నిన్ను కోరి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. క్లాస్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా మంచి వసూళ్ళని రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్య, సమంత తో తెరకెక్కించిన మజిలీ భారీ అంచనాల మద్య రిలీజ్ మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకుంది. పెళ్ళైన తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఈ సినిమా ఇద్దరికి మంచి క్రేజ్ ని తీసుకు వచ్చింది. దాంతో దర్శకులని ఈ కపుల్ ఆ తరహా కథ లనే అడుగుతున్నారు.

 

అంతేకాదు ఇండస్ట్రీలో యంగ్ హీరోలందరు శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారు. ఇక శివ నిర్వాణ మూడో సినిమాని మళ్ళీ నాని తో చేస్తున్న సంగతి తెలిసిందే. టక్ జగదీష్ పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు శివ నిర్వాణ. మళ్ళీ ఒక వినూత్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని ఖచ్చితంగా నాని కి భారీ హిట్ దక్కబోతుందని ఇప్పటికే టాక్ నడుస్తుంది. అయితే వాస్తవంగా ఈ సినిమాని ముందు విజయ్ దేవరకొండకి చెపాడట శివ నిర్వాణ. కథ కూడా విజయ్ కి బాగా నచ్చి చేద్దామనుకున్నాడట. కాని వరల్డ్ ఫేమస్ లవర్ భారీ డిజాస్టర్ కావడంతో ఈ సినిమా చేయడానికి వెనకడుగు వేశాడు.

అయితే ఇప్పుడు విజయ్ కి దక్కాల్సిన మంచి సక్సస్ నాని దక్కించుకోబోతున్నాడని అంటున్నారు. టక్ జగదీష్ తో దర్శకుడిగా శివ నిర్వాణ హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. దీంతో వరసగా ఫ్లాప్స్ మీద ఉన్న విజయ్ దేవరకొండ అనవసరంగా టక్ జగదీష్ ని వదులుకున్నాడని ఈ సినిమాతో మంచి సక్సస్ వచ్చేదని అది నాని అకౌంట్ లో పడబోతుందని చర్చించుకుంటున్నారట. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ సినిమాలో నటిస్తాడట.

Read more RELATED
Recommended to you

Latest news