విజయారెడ్డి ప్రాణం తీయడానికి కారణం అదేనా…? సురేష్ అప్పులు తీరుస్తామని హామీ ఇచ్చింది ఎవరు…?

-

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో… భూ బకాసురల హస్తం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వివాదాస్పద భూములను తక్కువ ధరకే దక్కించుకునే కొందరు కేటు గాళ్ళు విజయా రెడ్డిని హత్య చేయడానికి సురేష్ ని రంగంలోకి దింపారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం గ్రామంలోని 412 ఎకరాల వివాదాస్పద భూముల వాస్తవ పట్టాదారు రాజా ఆనంద రావు కాగా ఆయనకు సంబంధించిన ఆచూకి ఎవరికి తెలియదు.

దీనితో గౌరెల్లి, బాచారం, బండరావిరాల తదితర గ్రామాలకు చెందిన రైతులు ఆ భూములను కొన్నేళ్ళు గా సాగు చేసుకుంటున్నారు. దాదాపు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఆ భూములను వాళ్ళు సాగు చేసుకుంటున్న నేపధ్యంలో వారిని పంపించే ధైర్యం ఎవరికి లేదు. కౌలుదారు హక్కు చట్టం కింద పలువురు ధ్రువీకరణ పత్రం కూడా రైతులు పొందారు. దీనితో… ఆ భూములను సాగు చేసుకున్న రైతులకు, రక్షిత కౌలు దారులకు ఎంతో కొంత ఇచ్చి తక్కువ ధరకు భూములను నొక్కేస్తున్నారు. ఈ క్రమంలోనే సురేష్ కి చెందిన రెండు ఎకరాల భూమిని,

దక్కించుకోవడానికి కొందరు రంగంలోకి దిగగా… వాస్తవానికి ఆ భూమి హబీబ్ అనే రక్షిత కౌలు దారు పేరు మీద ఉండటంతో అతను భూమిని విక్రయించడానికి అంగీకారం తెలిపాడు. అవుటర్ రింగ్ రోడ్డు కి పక్కన ఉండటంతో ఎలాగైనా భూమిని దక్కించుకోవాలని చూసారు. అయితే పాస్ పుస్తకం మాత్రం ఇచ్చేది లేదని విజయారెడ్డి చెప్పడంతో ముందు సురేష్ ని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించిన వారు… ఆ తర్వాత లాభం లేకపోవడంతో అతనిని ఆమెను హత్య చేసే విధంగా ఉసి గోల్పారు. ఈ విధంగా రెండు ఎకరాల భూమి విజయారెడ్డి హత్యకు దారి తీసిందని అంటున్నారు. సురేష్ కి ఉన్న అప్పులను కూడా తాము తీరుస్తామని వాళ్ళు హామీ ఇచ్చినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news