కెసిఆర్ బంధువుల కిడ్నాప్ కేసు : కీలక అంశాలు వెలుగులోకి !

-

నిన్న రాత్రి సమయంలో కెసిఆర్ కు సమీప బంధువుల ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించి ఆ కుటుంబ పెద్ద ప్రతాప్ రావు కీలక అంశాలు వెల్లడించారు. తన ముగ్గురు తమ్ముళ్లు ని ఐటీ రైడ్స్ పెరితో వచ్చి కిడ్నాప్ చేశారన్న ఆయన కార్లలో కింద పడుకో పెట్టి, మొహానికి మాస్క్ వేసి తీసుకెళ్ళారని అన్నారు. చిలుకూరు రోడ్డు మీదుగా తీసుకెళ్లి ఓ ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి బందించారని, కంటిన్యూగా ఎవరితోనో కిడ్నాపర్లు ఫోన్ మాట్లాడుతున్నారని అన్నారు.

కొన్ని పేపర్లు, బాండ్లు మీద సంతకాలు పెట్టాలంటూ బెదిరించారన్న ఆయన నా ముగ్గురు తమ్ముళ్లను బెదరింపులకి దిగి పేపర్లు పై సంతకాలు చేయించుకున్నారని అన్నారు. దీంతో రైడ్స్ కావు, కిడ్నాప్ చేశారని క్లారిటీ వచ్చిందని వెంటనే పోలీసులకు సమాచారం అందించామని అన్నారు. ఆ తరువాత కొన్ని ఫోటోలను చూపించారని వారిలో ఇద్దరిని గుర్తు పట్టదాంతో అప్పుడే కిడ్నాప్ చేసింది ఎవరనేది తెలీసిపోయిందని అన్నారు. ఇంట్లో నుండి ఐపాడ్స్, కొన్ని డాక్యుమెంట్ లు తీసుకెళ్ళారని ఆయన అన్నారు.గత కొన్నేళ్లుగా ల్యాండ్ వివాదం ఉంది , అయితే ఈ భూమి పై గతంలో సుప్రీం కోర్ట్ నుండి క్లియరెన్స్ ఉందన్న ఆయన ఈ ల్యాండ్ వివాదం లో పార్ట్నర్స్ మధ్య విభేదాలు కారణం తోనే కిడ్నాప్ చేశారని తేల్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news