ట్రంప్ ఓటమికి కారణాలివే ?

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరి వరకు గట్టిపోటీ ఇచ్చినా సరే చేతిలో జో బైడెన్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. అయితే ఆయన ఓటమికి కారణాలు పరిశీలిస్తే కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ట్రంప్ ఓటమికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని విషయాలను పరిశీలిస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సర్కారు ఘోరంగా విఫలమైందని అమెరికన్లలో చర్చ జరుగుతోంది.

 

అదీ కాక నల్ల జాతీయుల మీద దాడులు పెరగటం, బ్లాక్ లైవ్స్ మేటర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. అలానే జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం అంతేగాక దేశంలో నిరుద్యోగ రేటు భారీగా పెరగడంతో అమెరికన్లకి ట్రంప్ మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అంతేగాక రష్యాకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడం కూడా ట్రంప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. అంతేకాక నాటో, జి-20 ఇలాంటి కూటములలో కూడా అమెరికా పరువు పోవడం అలానే ఇతర దేశాల వారికి వీసా నిబంధనలు కఠినతరం చేయడం, లైంగిక ఆరోపణలు, అనుభవరాహిత్యం, వివాదాస్పద వ్యాఖ్యలు వంటివి మరికొన్ని ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.