శృంగారం: మహిళలు భావప్రాప్తి పొందకపోవడానికి కారణాలు..

-

శృంగారంలో భావప్రాప్తి చాలా కీలకం. శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న ఆవేశాలు ఆగిపోయి ఆనందాన్ని అందించే స్థాయి అది. ఐతే చాలామంది మహిళలు భావప్రాప్తిని చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఒకసారి చూస్తే,

ఒకే స్థితిలో ఎక్కువ సేపు కూర్చోవడం

కంప్యూటర్ మీద పనిచేస్తూ గంటలు గంటలు ఒకే స్థితిలో కూర్చునే మహిళలు భావప్రాప్తిని చేరుకోవడం కష్టం అవుతుంది. నడుము నరాల మీద ఒత్తిడి పడి నొప్పి పెడుతుంది. అందువల్ల ఎక్కువ సేపు ఒకే స్థితిలో కూర్చోకుండా ప్రతీ అరగంటకి ఒకసారి అక్కడి నుండి లేచి, అటూ ఇటూ నడిచి, కావాల్సి వస్తే నడుమును వెనక్కి వంచాలి.

హై హీల్స్

హై హీల్స్ అందానికి బాగానే ఉంటాయి. కానీ భావప్రాప్తిని కష్టం చేస్తాయి. దీనివల్ల మర్మాంగాల నరాల మీద ఒత్తిడి పడి రతిక్రీడలో ఇబ్బంది ఉంటుంది. అందువల్ల భావప్రాప్తి కష్టం అవుతుంది.

నీళ్ళు తాగకపోవడం

కావాల్సినన్ని నీళ్ళు తాగకుండా ఉన్నట్లయితే శరీరంలో నీటిశాతం తగ్గి యోని భాగంలో తడి చేరక శృంగార ప్రక్రియ కష్టంగా మారుతుంది. అప్పుడు శృంగార అంటేనే భయం వేసేదిగా అనిపిస్తుంది.

మందులు

అనారోగ్య ఇబ్బందులతో ఉన్నవారు వాడే మందులు కూడా భావప్రాప్తికి ప్రతిబంధకంగా మారవచ్చు.

మాటలు లేకపోవడం

శృంగార సమయంలో అసలు ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే భావప్రాప్తిని చేరుకోలేరు. మీలో ఉన్న కోరికలను బయటపెట్టినపుడే దాన్ని చేరుకోగలరు.

టెన్షన్

అతిగా టెన్షన్ పడుతున్నప్పుడు మెదడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలాంటి ఆవేశాలు దానికి అందవు.

ఫోర్ ప్లే లేకపోవడం

ఫస్ట్ బాల్ ఫస్ట్ సిక్స్ కొట్టడం క్రికెట్ లో చెల్లుబాటు అవుతుంది కానీ శృంగారంలో కాదు. ఫోర్ ప్లే జరగాలి. మెల్లగా మొదలై పతాక స్థాయికి చేరుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news