ఆసుపత్రిలో చేరిన రెబల్ స్టార్ !

టాలీవుడ్ దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆస్పత్రిలో అయ్యారు. సోమవారం ఉదయం ఆయన నివాసంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలు ఎముక ఫ్యాక్చర్ అయిందని డాక్టర్లు తేలినట్లు సమాచారం అందుతోంది. శస్త్ర చికిత్స కోసం ఆయన ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారని సమాచారం అందుతోంది.

ఈ మేరకు అన్ని మీడియా ఛానల్ లోనూ వార్త వైరల్ అయింది. అంతేకాదు ఆయనకు శస్త్రచికిత్స కూడా చేసినట్లు మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కేవలం ఎప్పటిలాగే… ఆసుపత్రి చెకప్ కోసం వచ్చారని… ఆయనకు సంబంధించిన ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. రొటీన్ చెకప్ తో పాటు.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కృష్ణరాజు తెలుసుకున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇక త్వరలోనే కృష్ణం రాజు కుటుంబంతో యూకే వెళుతున్నారని ఆయన వర్గాల నుంచి సమాచారం అందుతోంది.