ప్ర‌భాస్ జోరు అక్క‌డ కూడా త‌గ్గ‌డం లేదుగా..!!

-

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. బాక్సాఫిస్ వ‌ద్ద ఈయ‌న సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఈ డార్లింగ్‌ను ఇష్ట‌ప‌డే వారే త‌ప్పా.. ద్వేషించే వారు చాలా అరుదు. ఆరడుగుల కటౌట్ , కండలు తిరిగిన దేహం తో అమ్మయిలకే కాదు , అబ్బాయిలకు కూడా మతి పోగొట్టేలా ఉంటాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత ఎన్నో సినిమాలు చేశారు. అయితే ప్ర‌భాస్ సినీ కెరీర్‌లో వ‌ర్షం సినిమా మొద‌టి స‌క్సెస్ ఇచ్చింది.

ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ప్రభాస్ హోల్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతోనే ప్ర‌భాస్ క్రేజ్ రెట్టింపు అయిపోయింది. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ నటించిన సాహో సినిమా ఫ్లాప్ అయినా.. భారీ వ‌సూళ్లు సాధించింది. ఈ సినిమా సౌత్ లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికి హిందీలో మాత్రం మాస్ ఆడియెన్స్ నుంచి క్లాస్ ఆడియెన్స్ వరకు అందరిని ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో జోరుగా దూకుపోతున్నాడ‌ట‌.

అవును! ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ‌ సార్లు ప్రస్తావన పొందిన టాలీవుడ్‌ హీరోల్లో ప్రభాస్ మొద‌టి స్థానంలో నిలిచాడు. ప్ర‌భాస్ పేరును ట్యాగ్ చేస్తూ పది లక్షలకు పైగా పోస్టులు ప్రచురితం అయ్యాయట. దీని బ‌ట్టీ ప్ర‌జ‌స్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో స్ప‌ష్టంగా అర్థం అవుతుంది. ఇక ఇందులో ఆ త‌ర్వాత స్థానం రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌క్కించుకున‌నాడు. విజ‌య్ పేరును ప్రస్తావిస్తూ దాదాపు తొమ్మిది ల‌క్ష‌ల‌కు పైగా పోస్టులు ప్రచురితం అయ్యాయట. ఆ త‌ర్వాత స్థానంలో అల్లు అర్జున్‌, నాని, మ‌హేష్ బాబు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news