రికార్డు స్థాయిలో తిరుమల వెంకన్న ఆదాయం

-

లాక్ డౌన్ ఎత్తి వేశాక తిరుమలకు క్రమంగా భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతోంది. నిన్న శ్రీవారిని 22462 మంది భక్తులు దర్శించుకున్నారు అయితే అందులో 7860 మంది భక్తులు తలనీలాలు కూడా సమర్పించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ లాక్ డౌన్ ఎత్తి వేశాక రికార్డు స్థాయి హుండీ ఆదాయం నిన్న నమోదయినట్లు తెలుస్తోంది.

ఏకంగా 3. 26 కోట్లు ఆదాయం లభించినట్లు సమాచారం. ఇక ఈ రోజు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. మరో పక్క ఈ రోజు ఆన్లైన్లో వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లను టిటిడి విడుదల చేసింది. ఇక మీదట ప్రతి నెల చివరి వారంలో ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టిడిపి పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news