వివాదాస్పదంగా మారిన స్వరూపానంద జన్మదిన వేడుకలు

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసి చిక్కుల్లో పడింది. అదేంటి అంటే విశాఖపట్నం శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మ దిన వేడుకలు జరపాలంటూ ఏపీ లోని కొన్ని ప్రముఖ దేవాలయాల ఈ ఓలకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆ ఆలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎంత పీఠాధిపతి అయినా వ్యక్తి పూజకి ఆస్కారం ఉండేలా ఈ ఉత్తర్వులు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి గతంలో కూడా ఈయన తిరుమల వస్తోంటే టీటీడీ అదనపు ధర్మారెడ్డి అలానే పాలక మండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి మరీ రిసీవ్ చేసుకున్నారు. ఈ విషయం కూడా కాస్త వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఎంతటి పెద్ద వ్యక్తులు వస్తున్నా తిరుమల ఆలయంలోకి వచ్చాకే వారిని రిసీవ్ చేసుకోవడం అనేది ఆనవాయితీ. అలాంటిది ఎక్కడో విమానాశ్రయానికి వెళ్లి మరీ రిసీవ్ చేసుకోవడం అనేది అప్పట్లో వివాదాస్పదంగా మారింది. మరి ఈ జన్మదిన ఉత్తర్వులు అంశం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news