ఇదేమి వర్షంరా బాబూ: అరగంటలో భాగ్యనగరం అల్లకల్లోలం … !

-

వారం రోజుల నుండి తెలంగాణ రాష్ట్రము అంతటా వర్షం మయం. ముఖ్యంగా హైద్రాబాద్ సిటీ అంతటా ఊహించని విధంగా వర్షాలు పడడంతో ఎక్కడ చూసినా జలమయం… ప్రభుత్వం కూడా ఊహించని ఈ వరదల కారణంగా స్కూళ్ళు, కాలేజీలు, కంపెనీలు అన్నిటికీ మూడు రోజుల వరకు సెలవులను ప్రకటించింది. ఈ వర్షాల ప్రభావం వలన GHMC మేయర్, సీఎం మరియు గవర్నర్ అందరూ ప్రజల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగిన చర్యలను తీసుకుంటూ ఉన్నారు. ఇక ఈ రోజు కురిసిన వర్షాల వలన హైద్రాబాద్ కేవలం అరగంటలోనే అల్లకల్లోలంగా మారిందట. మియాపార్, మూసాపేట్, కూకట్ పల్లి ప్రాంతాలలో 4 సెంటీమీటర్ ల వర్షపాతం నమోదు అయింది.. KPHB , జీడిమెట్ల , పఠాన్ చెరు, వెస్ట్ మారేడుమిల్లి , కుత్బుల్లాపూర్ , మల్కాజ్ గిరి ప్రాంతాలలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

బాలానగర్, ఖైరతాబాద్, చందానగర్, BHEL , బోరబండ, RC పురం, హఫీజ్ పేట ప్రాంతాలలో 2.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, కాప్రా ప్రాంతాలలో 2 సెంటీమీటర్ లు వర్షపాతం నమోదు అయ్యి రికార్డు సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news