చలికాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో సహజంగానే చాలా మంది దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ సమస్యలతో సతమతమవుతుంటారు. అనేక మందిని ఈ సమస్యలు బాధిస్తుంటాయి. ఇందుకు చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లడమో, మెడికల్ షాపుకు వెళ్లి తమకు తెలిసిన ట్యాబ్లెట్లను తెచ్చి వేసుకోవడమో చేస్తుంటారు. అయితే ఆయా సమస్యలు తగ్గాలంటే అందుకు ఇంగ్లిష్ మెడిసిన్ ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే దగ్గు, జలుబును కేవలం ఒక్క రోజులోనే వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
1. అల్లం
దగ్గు, జలుబు బాగా ఉంటే అల్లం టీ చేసుకుని తాగాలి. దీని వల్ల జలుబు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాగే ముక్కు నుంచి నీరు కారడం వంటి సమస్య ఉంటే వెంటనే తగ్గుతుంది. దగ్గు, జలుబుకు అల్లాన్ని ఎన్నో దశాబ్దాల నుంచి చిట్కాగా ఉపయోగిస్తున్నారు.
2. నిమ్మకాయ, దాల్చినచెక్క, తేనె
దగ్గు, జలుబు వెంటనే ఒక్క రోజులోనే తగ్గాలంటే నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి, తేనెలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో బాగా కలిపి తాగాలి. ఈ మిశ్రమంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అవి శరీరానికి తాజాదనాన్ని అందిస్తాయి. శ్వాస కోశ సమస్యలను వెంటనే తగ్గిస్తాయి.
3. విటమిన్ సి
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల దగ్గు, జలుబును త్వరగా తగ్గించవచ్చు. విటమిన్ సి ఉన్న ఆహారాలను తింటే జలుబు పెరుగుతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. జలుబు తగ్గుతుంది. దగ్గు, జలుబుకు కారణమయ్యే వైరస్‌ను విటమిన్ సి నాశనం చేస్తుంది. అందువల్ల ఈ విటమిన్ ఉండే ఆహారాలను తీసుకుంటే ఒక్క రోజులోనే అధిక శాతం వరకు ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
4. పసుపు, పాలు
భారతీయులు వంట ఇంటి పదార్థంగా పసుపును ఎంతో పురాతన కాలం నుంచి వాడుతున్నారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపును కలుపుకుని తాగితే దగ్గు, జలుబుల నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
5 బ్రాందీ, తేనె
ఇంటి చిట్కాల కోసం చాలా మంది బ్రాందీని వాడుతుంటారు. ఇది ఛాతిని వేడిగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. బ్రాందీతో తేనెను కలుపుకుని తాగితే తియ్యగా ఉంటుంది. దీంతోపాటు దగ్గు, జలుబు కూడా త్వరగా తగ్గుతాయి.